తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం అంటారు . కమ్యూనిస్టుల ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు . నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాటం అంటారు. దేశ స్వతంత్రం కోసం పోరాడినా నిజాం పాలన నుండి ఫ్రీడమ్ దొరకనందున జరిపిన పోరాటం అంటారు. దేశ సమైక్యత లో భాగం కావటానికి జరిపిన పోరాటం లేదా ఆక్షన్ డే అంటే జాతీయ. సమైక్యతా దినం అని ఒకరు తెలంగాణ విమోచన దినం అని అనేక విధాలుగా పిలుస్తూ 75 సంవత్సరాల తరువాత ఘనంగా ఉత్సవాలు నిర్వహణ ప్లాన్ చేసారు . వీరు వారు అని కాదు అన్ని రాజకీయ పార్టీలు సెంటర్ నుండి స్టేట్ వరకు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు . వారి వారి పార్టీ అవసరానికి తగ్గట్టు ఉత్సవాలు ఉంటాయి . ఎన్నడూ లేనంత గా ప్రజల మధ్యలోకి డిస్కషన్ గా వచ్చింది .
అంటే కాదు చాల అయోమయాన్ని కలిగిస్తోంది . అసలు చరిత్రలో ఆరోజు ఏమి జరిగింది ? ఎందుకు జరిగింది ? 75 yrs తరువాత సంఘటనను ఎలా చూడాలి ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్టి సమాచారం సమీక్ష లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ పాత్రికేయులు కే . శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము .