రక్తం అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న groups, classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?
ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, . తలసేమియా ఉన్న పిల్లవాడు అలసట, బలహీనత, నెమ్మదిగా పెరుగుదల, పేలవమైన ఆకలి మరియు రక్తహీనత వంటి లక్షణాలను చూపుతాడు. చికిత్స రక్త మార్పిడితో ఉంటుంది, దీని వల్ల కుటుంబంపై మానసిక మరియు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది.
తలసేమియా అంటే గ్రీక్ భాషలో సముద్రం అని అర్థం. ఈ వ్యాధికి గురైన చిన్నారికి జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ని కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి.
నివేదికల ప్రకారం, ప్రతి సంవత్సరం సగటున 10,000 మంది పిల్లలు తలసేమియాతో జన్మిస్తున్నారు మరియు జనాభాలో 3-4% మంది క్యారియర్లు. అందువల్ల, తల్లిదండ్రుల ఇద్దరికీ సమగ్ర జన్యు పరీక్ష యొక్క అవగాహన పెంచడం చాలా అవసరం.ప్రీ-నాటల్ టెస్టింగ్ మరియు క్యారియర్ స్క్రీనింగ్ అవసరం తలసేమియా కేసులను నివారించడానికి కీలకం పనిచేస్తుంది.
రక్తం పంచుకుని పుట్టిన పిల్లలకు తమకు తెలియని , నివారణ లేని ,లైఫ్ లాంగ్ రక్త మార్పిడి అవసరం అయ్యే తలసేమియా లాంటి అనారోగ్యం వస్తే రోగి ,కుటుంబం పరిస్థితి ఏంటి ? ఎక్కడికి వెళ్ళాలి ? వైద్యం ఎలా ? రోగ నిర్ధారణ ఎలా ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ్టి సునో ఇండియా వారి సమాచారం సమీక్షలో హోస్ట్ D .చాముండేశ్వరి తో ప్రముఖ డాక్టర్ అదితి కిశోర్ ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము .