మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు, గబ్బిలాలు, మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు మేలు చేస్తున్న ట్రీ. దేశ సంస్కృతి లో భాగం. అలాంటి జాతీయ వృక్షం కి ప్రమాదం వచ్చింది. అదీ ఎక్కడంటే హరిత హారం కి పెట్టింది పేరుగా గర్వించే తెలంగాణలో. హైదరాబాద్ కి 45km దూరం లో చేవెళ్ల మన్నేగుడ మార్గం లో. 125 ఏళ్ల నుండి వందల సంఖ్యలో ప్రకృతి గొడుగు పట్టినట్లున్న చేవెళ్ల మర్రి చెట్ల నీడ అభివృద్ధి పేరుతో ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ లో నశించే ప్రమాదం అంచున ఉన్నాయి. రహదారికి ఇరువైపులా మరో 9000 చెట్లు కూడా ఉన్నాయి. ఈ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిధులు మంజూరు చేయడంతో ఈ చెట్లపై గొడ్డలి వేటు పడే ప్రమాదం ఉంది. 1100 మర్రి చెట్లను నరికేయడాన్ని నిరసిస్తూ 200 మంది పర్యావరణ యోధుల బృందం తాజాగా సమావేశమైంది.
ఈ చెట్లను కాపాడాలంటూ పర్యావరణ పరిరక్షకుల బృందం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వాటి వద్ద దీపాలు వెలిగించి ఈ పురాతన చెట్లను పరిరక్షిస్తామని ప్రతిజ్ఙ చేశారు. మర్రి చెట్లను రక్షించుకునేందుకు చిన్నారులు, పెద్దలు కలిసి పెయింటింగ్స్ (Painting), పోస్టర్ల (Poster)ను ప్రదర్శించారు. చెట్లకు ప్రేమతో దారాలు కట్టారు. మర్రి చెట్లను రక్షించుకునేందుకు సంస్థ సభ్యులు ఆన్‌లైన్ (Online) ద్వారా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఒక వేళ చెట్లను నరికి మరోచోట నాటినా అవి ఒకేలా ఉండవు, వాటి కొమ్మలు కత్తిరించి వేస్తారు. అందుకే రహదారి విస్తరణ ప్రాజెక్టును ఆపాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (Highways Authority of India)కు విజ్ఙప్తి చేశారు.
NGT లో case file చేశారు.పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి అంటే పర్యావరణం ని spoil చెయ్యటమా? చెట్లు కొండలు నదులు అడవులు నేలను రూపుమాపే చర్యా? ఎవరి స్వార్థం కోసం? పౌరులుగా,ప్రకృతి లో భాగ స్వాములుగా పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నం లో అందరం కలసి రావాల్సిన అవసరం లేదా? ఇవాళ్టి సమాచారం సమీక్ష Interview లో హోస్ట్ చాముండేశ్వరి తో బాలాంత్రపు తేజ గారు చేవెళ్ల మర్రి చెట్ల ను కాపాడే ఉద్యమం గురించిన అనేక విషయాలను చెప్పారు.