140 కోట్ల జనాభా అందులో దాదాపు 60% వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం 20. 19% . కరోనా పాండమిక్
లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు ఆకాంక్షలకు షాక్ తగిలేలా వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఎంత నిజం ? కారణం ఏంటి ?
అగ్రికల్చర్ లో ఫైనల్ స్టేజి అయినా ధన్య సేకరణ ,మద్దతు ధర , సమయానికి పేమెంట్ ని ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి . పండించిన పంటను రైతు మార్కెటింగ్ చేసుకునే స్థోమత , వీలు ,అనుభవం ఉండకపోవచ్చు . ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వాలే రైతుల పాలిట ఆశాకిరణం . వెల్ఫేర్ స్టేట్ భాద్యత కూడా .
అలాంటిది ప్రభుత్వమే ధాన్య సేకరణ ఖర్చు భరించలేము . ప్రైవేట్ వాళ్ళు తక్కువ ధరకే నాణ్యమైన ధాన్యం సేకరిస్తారు అంటే దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందనుకోవాలి ? రైతులకి బేరం ఆడే శక్తి ఉంటుందా ? కనీస మద్దతు ధర సంగతి ఏంటి ? ధాన్య సేకరణ ప్రైవేట్ వాళ్ళు చేస్తే గ్రైన్స్ ప్రాసెసింగ్ , స్టోరేజ్ పంపిణి ఎవరి ఆధీనం లో ఉంటుంది ? అగ్రికల్చర్ లో .ప్రభుత్వం భాధ్యత ఏంటి ? ఆహార భద్రతా చట్టం అమలు సంగతి ఏంటి ? FCI పాత్ర ఏంటి ? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా మారవచ్చు ? రైతులకు , ప్రజలకు లేదా ప్రైవేట్ కి ఎవరికీ లాభం ?
ఇవాళ్టి సమాచారం సమీక్షలో హోస్ట్ డి . చాముండేశ్వరి తో తెలంగాణ స్టేట్ రైతు సంఘం
జనరల్ సెక్రటరీ పశ్య పద్మ గారి ఇంటర్వ్యూ లో వినండి .