సమాచారం సమీక్ష - A Telugu News Podcastసమాచారం సమీక్ష - A Telugu News Podcast

చేనేత రంగానికి GST పెద్ద దెబ్బ

View descriptionShare

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెల 
53 clip(s)
Loading playlist

కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి  800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.  2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరియు సహాకార సంఘాల పటిష్టత కోసం 6 వేల కోట్ల ప్రత్యేక   త్రిబుల్ ఆర్ (REVIVAL, REFORM AND RESTRUCTURING PACKAGE FOR HANDLOOM SECTOR) ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి 2825 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి  760 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మూడు ఆర్థిక  సంవత్సరాల (2011-2014) కాలపరిమితిలో  ఈ పథకం కింద కేవలం  760 కోట్లు ఖర్చు చేసింది.

2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేనేత రంగ కేటాయింపులను మరింతగా తగ్గించింది. ప్రస్తుత 2022-23  ఆర్థిక సంవత్సరానికి 410 కోట్లు కేటాయించి ఇప్పటివరకు కేవలం 20 కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది
మహాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐ.సి.ఐ.సి.ఐ లంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కమ్ వర్క్ షెడ్ మరియు త్రిఫ్ట్ ఫండ్ పథకాలు రద్దయ్యాయి. చేనేత రంగానికి 410 కోట్లు కేటాయించి వేల కోట్లలో చేనేత రంగం నుండి జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.Over 15 lakh jobs in main and ancillary units లో కోల్పోతున్నాయి  result of  GST increase.  unorganized sector accounts for over 80% of fabric production in the country, raising the GST on fabrics to 12% will hurt power loom and handloom weavers. బట్టల ధరలలో 15-20% పెరుగుదలకు అవకాశం ఉంది. రూ.పేద మధ్య తరగతి కొనుగోలు దారులే ఎక్కువగా నష్టపోతారని వ్యాపారుల వాదన.నిజం కూడా.  కొనుగోలుదారులపై 5% జీఎస్టీ విధిస్తే రూ.1,500 కోట్లు, 5% జీఎస్టీని 12%కి పెంచితే రూ.3,600 కోట్లకు పెరుగుతుందనీ ప్రజలపై దాదాపు రూ.2,100 కోట్ల అదనపు భారం పడుతుందని వాదన.అంతిమంగా ప్రతి టాక్స్ పెరుగుదల ను భరించేది కస్టమర్.
 అటు చేనేత రంగానికి ,ఇటు వినియోగదారులకు ఎవ్వరికీ బెనిఫిట్
 లేని పన్నుల పెంపు ఎంతవరకు సమంజసం?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేనేత ఎగుమతుల విషయంలో గత ప్రభుత్వం యొక్క బెంచ్ మార్కును దాటలేకపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2812 కోట్ల రూపాయల చేనేత ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. చేనేత రంగ అభివృద్ధి మరియు చేనేత కళాకారుల సంక్షేమం కోసం తాను పని చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం విశ్వాసాన్ని కల్పించారు. కానీ వాస్తవికతలో దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.
రోటీ కపడా మకాన్ ప్రజల నిత్యావసరాలు. మరి చేనేత పై ఇంత వివక్ష ఎందుకు ?

ఈ విషయం గురించి మరిన్ని విషయాలు Founder of National handloom day, President, Akhila Bharatha Padmashali Sangam handloom యార్రమాద వెంకన్న నేత గారి interview లో విందాము.

  • Facebook
  • X (Twitter)
  • WhatsApp
  • Email
  • Download

In 1 playlist(s)

  1. సమాచారం సమీక్ష - A Telugu News Podcast

    53 clip(s)

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, త 
Follow podcast
Recent clips
Browse 53 clip(s)