ఇండోనేసియా అడవుల నుండి ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే దేశపు పెద్ద అడవికి పారిపోయి వచ్చిన కోతుల గుంపును అడ్డుకున్న కొత్త దేశపు అడవి కోతులు, కొత్త కోతుల్ని రాజు దర్బార్ కు బందీ గా తీసుకు వెళ్ళాయి.కోతుల నాయకుడు వాలి వంట నూనె పంట అయిన పామాయిల్ చెట్ల పెంపకం ,నూనె తయారు పద్ధతులతో మరియు పామాయిల్ పెంపకం కోసం కట్ చేస్తున్న అడవులు, అడవి జంతువుల జీవితాలు ,అడవులు గాలి నీరు పర్యావరణం పరిసరాలు చివరికి మనుషుల furure ఎంతటి ప్రమాదం లో పడుతుంది చెప్పాడు.అంతే కాదు ప్రపంచం లోనే పెద్ద కార్బన్ సింక్ అయిన తమ దేశం ఎలా క్లైమేట్ చేంజ్ కి కారణం అవుతుంది చెప్పాడు. అంతే కాదు మనిషి స్వార్ధం తగ్గించుకుని వనరులను సంరక్షించడం చేస్తే అందరికీ మంచిది అంటూ ఒక విన్నపం రిక్వెస్ట్ లెటర్ ను పావురం తో పంపి జవాబు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ కథ లో.